రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: ధర్మాన

హైదరాబాద్‌: తన రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదే అని మంత్రి ధర్మాన  ప్రసాద్‌రావు తెలియజేశారు. వాన్‌పిక్‌ వ్యవహారంపై నిన్న రాత్రి సీఎంను కలిసి వివరణ ఇచ్చానని మంత్రి చెప్పారు. సీబీఐ తనపై మోపిన అభియోగాలపై సీఎం వివరణ కోరారని పేర్కొన్నారు. తనను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ  ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలియజేశారు. గడిచిన 45 రోజులుగా తన రాజీనామా, ఇతర అంశాలపై కథనాలు వస్తున్నాయన్నారు. తాను ఇచ్చిన వివరాలను ప్రభుత్వం ఆధ్యయనం చేస్తుందని నమ్ముతున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు.  కేబినేట్‌ నిర్ణయం చేయకుండా ఒక్క  ఎకరా భూమి కేటాయించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.  సీబీఐ చేసింది. ఆరోపణలు మాత్రమే అని తెలియజేశారు. ఆరోపణలను నేరాలుగా పరిగణించొద్దని పార్టీలు, ప్రజలకు మనవి చేస్తున్నానని అన్నారు. తెలిసిగానీ, తెలియకగానీ ఒక్క తప్పు కూడా చేయలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు నిరాథారమని రుజువు చేసుకుంటాను అని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగిందా లేదా అన్నది ప్రభుత్వం చూడాల్సి ఉందన్నారు.