రాజీవ్‌ రహదారిని జాతీయరహదారిగా ప్రకటించాలి

లోక్‌సభలో ఎంపి వినోద్‌ డిమాండ్‌
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  రాజీవ్‌ రహదారిని మంచిర్యాల్‌ చంద్రాపూర్‌ విూదుగా నాగ్‌పూర్‌ వరకు విస్తరించాలని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కోరారు. హైదరాబాద్‌-కరీంనగర్‌-రామగుండం మధ్యలో పదేళ్ల క్రితం పీపీపీ పద్ధతిలో నిర్మించన ఈ రోడ్డు.. ఎక్కువ ట్రాఫిక్‌ ఉండటం వల్ల ప్రమాదాలకు నెలవుగా మారుతోందన్నారు. చాలా మంది చనిపోయి వారి కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేవారు. దీనిపై ప్రభుత్వం వెంటనే దృప్టి పెట్టాలని కోరిన ఎంపీ వినోద్‌ విన్నవించారు. ఈ మేరకు లోక్‌సభలో ఆయన జీరో ఈ అంశాన్ని ప్రస్తావించారు. రోడ్డు వంకరల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిని విస్తరించడంతో పాటు పొడిగించి జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు.
శివకుమారస్వామికి భారత రత్న ఇవ్వాలి
ఇటీవల దివంగతుడైన శివకుమారస్వామికి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ కోరారు. లోక్‌ సభలో మాట్లాడిన పాటిల్‌.. శివకుమార స్వామి గొప్ప మానవతావాది, ఆధ్యాత్మిక గురువని కొనియాడారు. ఆయన స్థాపించిన 132 విద్యాసంస్థల ద్వారా అన్ని వర్గాల పేదలకు ఉచిత విద్య, భోజనవసతి కల్పిస్తున్నారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని కోరారు. ఆయన సేవలను దివంగత నాటి రాష్ట్రపతి కలాం కొనియాడారని తెలిపారు.