రాజ్యసభకు సచిన్‌ను ఎంపిక చేయడంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : రాజ్యసభకు క్రికెటర్‌ సచిన్‌ను ఎంపిక చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సచిన్‌ను ఏవిధంగా రాజ్యసభకు నామినేట్‌ చేశారని రామ్‌గోపాల్‌ సింగే అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే రాజ్యాంగం ప్రకారమే ఆయన ఎంపిక జరిగిందని ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది. దీంతో ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఏప్రిల్‌ 26న సినీ నటి రేఖతోపాటు సచిన్‌ను రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.