రాజ్యసభలో తోపులాట
న్యూఢిల్లీ: ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో గందరగోళం నెలకొంది. సభ్యులు వాగ్వాదానికి దిగి ఒకరినొకరి తోసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించే అంశాన్ని సభలో సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకించింది. మరోవైపు బిల్లుకు మద్దతు తెలిపిన బీఎస్పీ సభ్యులు ఎస్పీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ సమయంలో సభ్యులు తమ సీట్లలోంచి లేచి వాగ్వాదానికి దిగారు. సభ్యుల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.



