రాత్రంతా ఇక్కడే ఉంటాం ఎవరూ ఇంటికి పోవద్దు: కోదండరాం

హైదరాబాద్‌: కవాతుకు వచ్చిన వారు రాత్రంతా ఇక్కడే ఉండాలి, ఎవరూ ఇంటికి పోవద్దని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలంగాణ వాదులకు సూచించారు. తాము ఇక్కడే కూర్చుంటామిని, ఎవరికీ ఇబ్బంది కలిగించమని ప్రకటించారు. అవకాశం మేరకు ఆహారం, నీరు అందిస్తా రాత్రంతా ఇక్కడే కూర్చుందామని వెల్లడించారు. సాగరహారం సభలో కోదండరాం మాట్లాడుతూ అవసరమైతే మంత్రులు రాజీనామా చేసి తెలంగాణ ప్రకటన తెప్పించాలని డిమాండ్‌ చేశారు. మడియా వాహనాలపై దాడికి విచారిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ కోసమే ఇక్కడికి వచ్చాం, ప్రభుత్వం తన ఆలోచన ఏమిటో స్పష్టం చేయాలని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వమే లేదని కోదండరాం ఆరోపించారు. తెలంగాణ వచ్చినట్టే వచ్చి వెనక్కి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగం ఆపాలని, అరెస్టుచేసిన వారికి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కవాతుకు ఎన్నో అడ్డంకులు సృష్టించారని, అన్ని బస్సులు, రైళ్లను నిలిపివేశాన్నారు. ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్లే బలిదానాలని పేర్కొన్నారు.