రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 24వేల పోస్టాఫీసుల అనుసంధానం
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 24,000 వేల పోస్టాఫీసులను అనుసంధానించేందుకు పోస్టల్ విభాగం ప్రణాళికలు రచిస్తోంది. కోర్ బ్యాంకింగ్ పరిజ్ఞానం ఆధారంగా 122 డీపీవోలను అనుసంధానించేందుకు మూడు నెలల ఫైలట్ ప్రజెక్టును ప్రారంభిస్తున్నాం. అనంతరం 22 నెలల వ్వవధిలో అన్ని డీపీవోలను అనుసంధానిస్తాం అని కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల పార్లమెంటుకు అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి 31నాటికి పోస్టాఫీసుల్లో 26 కోట్ల చిన్నమొత్తాల పొదుపు ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాల్లో 1.9లక్షల కోట్ల మొత్తం ఉంది.



