రాష్ట్రంలో మండుతున్న ఎండలు

అత్యధికంగా కడపలో 41 డిగ్రీలు నమోదు
హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, రెంటచింతల, హన్మకొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అలాగే నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో 39 డిగ్రీలు, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రామగుండం, తిరుపతిలో 38 డిగ్రీలు , నందిగామ, నెల్లూరు, తుని, విజయవాడ, విశాఖ, భద్రాచలంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదయ్యాయి. నల్గొండలో 37 డిగ్రీలు, హకీంపేట, కావలి, బంగోలులో 36 డిగ్రీలు, కాకినాడలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.