రాష్ట్రం మంచి నేతను కోల్పోయింది: గవర్నర్‌

హైదరాబాద్‌: టీడీపీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఒక మంచి నేతను కోల్పోయిందని ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబసభ్యులకకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.