రాష్ట్రపతి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏఐవైఎఫ్‌

హైదరాబాద్‌: బొల్లారంకు వెళుతున్న రాష్ట్రపతి వాహనశ్రేణిని బేగంపేట ఫ్లైఓవర్‌ వద్ద అడ్డుకునేందుకు ఏఐవైఎఫ్‌ కార్యకర్తలు యత్నించారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వ నాన్చివేత ధోరణి, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  10 మంది కార్యకర్తలు రాష్ట్రపతి వాహనశ్రేణిని అడ్డుకునేందుకు దూసుకువచ్చారు.అయితే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.