రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది కోసం ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రణబ్ 27న తిరుపతిలో జరిగే తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 28న చెన్నైలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. 29, 30 తేదిల్లో మహారాష్ట్రలోని సోలాపూర్, పుణె, ముంబయిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.