రాష్ట్రవ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు
హైదరాబాద్ : ఈస్టర్ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జంట నగరాల్లోని ప్రముఖ చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో వేడుకలు సూర్యోదయ ఆరాధనతో ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో క్రైస్తవులు ఇక్కడికి తరలివచ్చారు. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ చర్చిలో ఈస్టర్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈస్టర్ పండగను పురస్కరించుకొని క్రైస్తవులు వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.


