రాష్ట్రవ్యాప్తంగా చెడగొట్టు వానలు
` పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు
` మార్కెట్‌యార్డుల్లో తడిసిన ధాన్యం
` నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
` తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం
` మహబూబ్‌నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటుతో కార్మికుడి మృతి
` నేడు కూడా పలు జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్లు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనం కల్పించాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో ఈదురు గాలులు ఒక్కసారిగా బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలతో కోల్ బెల్ట్ రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలువురి ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు గంట పాటు భారీ వర్షం కురవడంతో జన జీవనం కాసేపు స్తంభించింది.మహబూబ్‌నగర్ జిల్లా కురవి మండలం సూదనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపడి కార్మికుడు మృతిచెందాడు. కొనుగోలు కేంద్రంలో ధాన్యంపై టార్పాలిన్లు కప్పుడుతుండగా పిడుగుపాటు సంభవించింది. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న నీలం వెంకన్న ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇద్దరు రైతులు అస్వస్థతతకు గురయ్యారు.సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్?లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణం అవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మార్కెట్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ధాన్యం తెచ్చి 15 రోజులు దాటినా కొనుగోలు చేయట్లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిసి ధాన్యం తడుస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. మందమర్రి, సింగరేణి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. భద్రాద్రి జిల్లా ఇల్లందు, గుండాల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రహదారులపై ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో విÖటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోవిÖటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి, తదుపరి మÖడు రోజుల్లో క్రమేపి రెండు నుంచి మÖడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.



