రాష్ట్ర డీజీపీల సమావేశంలో పాల్గొన్న ప్రధాని

న్యూఢిల్లీ: రాష్ట్ర డీజీపీల రెండో రోజు సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సముద్ర మార్గాలు ఎంచుకునే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. సైబర్‌ నేరాలను ఆరికట్టేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని తెలియజేశారు.