రాష్ట్ర మైనార్టీల ఆర్థిక సంస్థలో రూ.56 కోట్ల డిపాజిట్ల గోల్‌మాల్‌

హైదరాబాద్‌: రాష్ట్ర మైనార్టీల ఆర్థిక సంస్థలో రూ.56 కోట్ల డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్వవహారంపై మైనర్టీ సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. ఈ వ్వవహారంలో ఇప్పటికే సంస్థ అకౌంటెంట్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఆలీపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఉన్నతాధికారుల పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి దాన కిశోర్‌ తెలిపారు. మైనార్టీ విద్యార్థుల ఉపకార వేతనాలకు ఎలాంటి ఢోకా లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.