రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య

హయత్‌నగర్‌  : హైదరాబాద్‌ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామ సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు, మృతుడిని రామాందపూర్‌ గోపినగర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డిగా గుర్తించారు. రాజేందర్‌రెడ్డి కనిపించడం లేదంటూ మూడు రోజుల క్రితం అతడి భార్య ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్నేహితులే రాజేందర్‌రెడ్డిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.