రుణాలు మంజూరు చేయాలంటూ ప్రదర్శన

ఖమ్మం (వ్యవసాయం): బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం ఖమ్మంలో గొర్రెలు, మేకలు పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన మయూరి సెంటర్‌, బస్టాండ్‌, వైరా రోడ్డు, జెడ్పీ సెంటరు మీదుగా కలెక్టరేటుకు చేరుకుంది. అనంతరం కలెక్టర్‌ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకలు సంఘం గౌరవ అధ్యక్షులు ఐలయ్య, జిల్లా అధ్యక్షుడు జమలయ్య తదితరులు పాల్గొన్నారు.