రూ.కోటీ విలువైన ఎర్రచందనం పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గురువారం వేకువజామున అటవీశాఖ నిర్వహించిన వేరువేరు దాడుల్లో మూడు వాహనాలు సహా రూ. కోటి విలువైన ఎర్రచందనం పట్టుబడింది. మండలంలోని ముంగిలిపట్టు వద్ద ఓమ్ని వాహనంలో తరలిస్తున్న 25 దుంగలు, గంగుడుపల్లి వద్ద ఐసర్‌ వ్యాన్‌లో తరలిస్తున్న 75 దుంగలు, నడింపల్లి వద్ద స్వరాజ్‌ మజ్డా వ్యాన్‌లో తరలిస్తున్న 70 దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దుంగలు విలువ  రూ.కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలియజేశారు.