రెండు థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అంతరాయం

రాష్ట్రానికి మరిన్ని కరెంటు కష్టాలు

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని కరెంటు కష్టాలు వీడటం లేదు. రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 11వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తి 550 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అలాగే విజయవాడ వీటీపీఎన్‌ 7వ యూనిట్‌ బాయిలర్‌లో సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 30 నిమిషాలు 500 మెగా యూనిట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. లోపాన్ని పునరిద్ధరించడంతో యూనిట్‌ను మళ్లీ సర్వీసులోకి తీసుకుంటున్నారు.