రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే

share on facebook


వివాదాలపై స్పందించన టిఆర్‌ఎస్‌
బిజెపి గెలిస్తేనే తెలంగాణలో నిలుస్తుంది
టిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక ఈటెలకు రాజకీయంగా దెబ్బే
కరీంగనగర్‌,నవంబర్‌1  (జనంసాక్షి) : రాష్ట్ర ప్రజలందరూ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నేడు జరిగే ఫలితం తీరుపై అటు కెసిఆర్‌ ఛరిష్మా లేదా ఆయన నాయకత్వ సమర్థతపై ఆధారపడి ఉంటుంది. కెసిఆర్‌ వ్యూహం ఫలించి గెలిస్తే ఆయనకు తిరుగు ఉండదు. లేకుంటే కుండకు చిల్లు పడిరదని గ్రహించాల్సిందే. అలాగే ఈటెల రాజకీయ భవిష్యత్‌ కూడా తేలిపోనుంది. ఈటెల గెలిస్తేనే రాజకీయంగా నిలుస్తారు. టిఆర్‌ఎస్‌ను ఎదిరిస్తారు. బిజెపిక కూడా కొంత బలం పెరుగుతుంది. టిఆర్‌ఎస్‌పై పోరాడేందుకు అవకావం ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నికలు జరిగినా కేవలం హుజూరాబాద్‌పైనే ప్రజలంతా దృష్టి పెట్టారు. బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితం
కూడా నేడే వెల్లడి కానుంది. మరోవైపు పోలింగ్‌ ముగిసినా వివాదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎన్ని మార్గదర్శక సూత్రాలు జారీచేసినా అవేవి ఇక్కడ అమలు కాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పోలింగ్‌ మగిసేంత వరకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తూ పోలింగ్‌ కేంద్రాలకు సవిూపంలోనే పోలీసు పహారా ఉన్నా పోలింగ్‌ స్లిప్పులతోపాటు వెయ్యి రూపాయల చొప్పున ఓటర్లకు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారయంత్రాంగం మాత్రం పోలింగ్‌ పక్రియ ప్రశాంతంగా జరిగిందని, 86.64శాతం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని ప్రకటించింది. ఎన్నికల పక్రియలో అధికారయంత్రాంగంపై భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు అధికారపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శలు చేసింది. ఉన్నతాధికారులు ఆ విమర్శలను ఖండిరచారు. శనివారం పోలింగ్‌ ముగిసిన తర్వాత హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి పోలీసు బందోబస్తు మధ్య బస్సుల్లో ఈవీఎంలను, వీవీపాట్స్‌ను తరలిస్తుండగా ఆ బస్సులను సుమారు గంటగంటన్నరకు పైగా రోడ్డుపైనే నిలిపేశారు. బస్సు పంక్చర్‌ అయిందని కొందరు, రిపేర్‌కు వచ్చిందని కొందరు కారణాలు చెబుతున్నా బీజేపీ నాయకులు మాత్రం టీఆర్‌ఎస్‌ చెందిన ఒక నాయకుడి హోటల్‌ ఎదుట బస్సులను గంటసేపు నిలపడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత బస్సులు కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రంలోని స్ట్రాంగ్‌ రూం వద్దకు చేరుకున్నాయి. ఈ మొత్తం క్రమంపై సిబిఐ విచారణ జరపాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది. ఇదే క్రమంలో ఎస్సారార్‌ కళాశాల ఎదుట బస్సును నిలిపివేసిన సమయంలో కొన్ని ఈవీఎం, వీవీప్యాట్స్‌ను ప్రైవేట్‌ కారులో తరలించారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ విూడియాలో పోస్టు చేయడంతో బీజేపీ నాయకులు తెల్లవారుజామున రెండున్నర గంటల సమయం లో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నాడని ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడిరచ డంతో ఈవీఎంలను మార్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆందోళనకు దిగారు. ఆదివారం బీజేపీ జిల్లాశాఖ కూడా ఈ విషయంలో ఆందోళన చేపట్టి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. కారులో పెట్టిన వీవీ ప్యాట్స్‌ ఎన్నికల్లో వినియోగిం చలేదని, దానిని వేరొక కౌంటర్‌లో భద్రపరిచేందుకు కారులో పంపి స్తుండగా వీడియో తీసి వైరల్‌ చేశారని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ సజావుగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. ఇకపోతే ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్‌ శంకర్‌ నారాయణతో కలిసి సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళి, ఓటింగ్‌ శాతంపై అభ్యర్థులకు వివరించారు. మాక్‌ పోలింగ్‌, పీవో డైరీ, ఏఎస్‌డీ ఓటర్లు, బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లు, పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు, తదితర అంశాలపై అభ్యర్థులకు వివరించారు. మరోవైపు సోషల్‌ విూడియాలో వచ్చే పుకార్లను నమ్మకూడదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో సీహెచ్‌ రవిందర్‌రెడ్డి పేర్కొన్నారు. 2న కౌంటింగ్‌ జరుగుతుందని, కౌంటింగ్‌కు కూడా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లు సహకారం అందించా లని కోరారు. పోలింగ్‌లో వినియోగించిన బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లను ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచామని, దీనిపై ఎటువంటి అపోహలు సందేహాలకు తావు లేదన్నారు. సోషల్‌
విూడియాలో అసత్యపు ప్రచారాలు నమ్మకూడదని ఆయన తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. దీనిపై విచారణ జరిపి పారదర్శకంగా వ్యవహరిస్తారా లేదా అన్నది చూడాలి.

Other News

Comments are closed.