రెండు లారీలు ఢీ, ముగ్గురి మృతి

విశాఖ : విశాక జిల్లా పాయకారావుపేట మండలం నామవరం జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమదంలో ఒకే కుటుంబానకి చెందిన ముగ్గురు మృతి చెందారు. రెండు లారీలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఓ పురుషుడు ఉన్నారు.
శ్రీకాకళం జిల్లా సంతకవిటకు చెందిన 14 మంది వ్యవసాయ కూలీలు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో జరిగిన జాతరకు వెళ్ళివస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. కంటైనర్‌ లారీ రాంగ్‌రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.