రెట్టింపైన ప్రధాని ఆస్తులు

ఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆస్థిపాస్తులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. గత ఏడాది ఆయన ఆస్తులు రూ.5.11 కోట్లు కాగా ఈ ఏడాది రూ.10.73 కోట్లని పీఎంవో వెబ్‌సైట్‌ పేర్కొంటోంది. అయితే ప్రధాని మంత్రి వర్గ సహచరుల్లో పలువురు అయనకన్నా ధనవంతులట. ప్రపుల్‌ పటేల్‌ ఆస్తి రూ. 52 కోట్లు కాగా, శరద్‌పవార్‌కి 22 కోట్ల ఆస్తులున్నాయి. మరో కేంద్రమంత్రి ఆళగిరికి రూ. 9.50 కోట్ల ఆస్తులున్నాయని తాజాగా అవ్‌డేట్‌ చేసిన ఈ వెబ్‌సైట్‌ పేర్కొంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆస్తి రూ.55 లక్షలు మాత్రమేనట, కేబినెట్‌ మంత్రుల్లో అందరికన్నా పేద ఆయనే. ప్రధాని మన్మోహన్‌కి ఢిల్లీలో ఒకటి, చండీఘర్‌లో ఒకటి మొత్తం రెండు ఫ్లాట్స్‌ ఉండగా వాటి విలువ రూ.7.27 కోట్లు. బ్యాంకు పెట్టుబడుల్లో మరో 3.46 కోట్లు ఉన్నాయి. ప్రధాని సొంతకారు మారుతి 800 ఆస్తులు పెరగకపోయినా వ్యాల్యుయేషన్‌ మారడం వల్లే ప్రధాని ఆస్తుల విలువ రెట్టింపైందని పీఎంలో కార్యాలయం పేర్కొంది.