రేడియోశ్రోతులతో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల

హైదరాబాద్‌: సాధారణంగా మధ్యతరగతి కాలనీల్లో ఉండే వాతావరణాన్ని తలపించే విధంగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంఆ ఆయన రేడియో మిర్చిలో రెండు పాటలను విడుదల చేశారు. శేఖర్‌ కమ్ములతో పాటు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌ కూడా హాజరై శ్రోతలతో మాట్లాడారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు తెలిపారు. సంతోషంగా తిరిగే ఆరుగురు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువత చుట్టూ తిరిగే కధాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని శేఖర్‌ కమ్ముల చెప్పారు.