రేపటి నుంచి చైనాలో మంచు ఉత్సవాలు ప్రారంభం

బీజింగ్‌: ప్రపంచంలో అతిపెద్ద మంచు ఉత్సవాల్లో ఒకటైన చైనా మంచు ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాఇ హెలింగ్జియాంగ్‌ ప్రాంతం రాజధాని హర్బిన్‌లో జరగనున్న 29వ హెర్బిన్‌ అంతర్జాతీయ మంచు ఉత్సవాల కోసం భారీ ఆకారాల్లో మంచు శిలలు రూపొందించారు. ఇక్కడ శీతాకాలంలో మైనన్‌ 16.8 డిగ్రీల ఉష్ణోగ్రతల ఉంటుంది. 1963 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల మధ్యలో నిలిచిపోయిన ఈ ఉత్సవాలు తిరిగి 1985లో ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో నిర్వహించే నాలుగు అతి పెద్ద మంచు ఉత్సవాల్లో  హర్బిన్‌ మంచు ఉత్సవం ఒకటి.