రేపటి నుంచి డీఎస్సీ నియామకాలు

హైదరాబాద్‌: డీఎస్సీ -2012 ఉపాధ్యాయ నియామకాలను సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నెల 22న అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెల్లడిస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను 23, 24 తేదీల్లో పరిశీలించి, 26న తుది జాబితాను వెల్లడిస్తారు. 27, 28 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు పాఠశాల కమిషనర్‌ శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న జాబితాలను రద్దు చేసి తాజా జాబితా ప్రకారం నియామకాలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 610 జీవోకు అనుగుణంగా నాన్‌లోకల్‌ అభ్యర్థులను కట్టడి చేసే విధంగా మొదటి 20 శాతం ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు ఒకసారి, మిగతా 80 శాతం కేటగిరీ అభ్యర్థులకు ఒకసారి ప్రక్రియ చేపట్టి భర్తీ చేయాలని ఆదేశించారు.