రేపు గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ రేపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి దశలో 87 నియోజ కవర్గాలో పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో  భారీ భద్రతను చేపట్టారు. మద్యం దుకాణాలను ఈ నెల 17 వరకు మూసి ఉంచాల్సిందిగా ఈసీ ఆదేశించింది. మొదటి దశ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది.