రేపు గుజరాత్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. నిన్న సాయంత్రం నేతల ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో దశలో మొత్తం 95 నియోజకవర్గాల్లో 820 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అన్ని స్థానాల్లో భాజపా పోటీ చేస్తుండగా.. 92 స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి దించింది. రెండో దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను చేపట్టారు. మొదటి దశలో 87 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా.. 68 శాతం ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 20న చేపట్టనున్నారు.