రేపు విశాఖలో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : విశాఖలో ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. జీకే వీధిలో సీఎం రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మరోవైపు మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో జీకే వీధి, చింతపల్లి మండలాల్లో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు.