రేపే ఎంటెక్ నోటిఫికేషన్
హైదరాబాద్: ఎంటెక్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. నవంబర్ 8 నుంచి 16 వరకు ఎంటెక్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫార్మా-డి నోటిఫికేషన్‌ను కూడా రేపే విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 4 నుంచి 7 వరకు ఫార్మా-డి కౌన్సిలింగ్ చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ఈ మేరకు ప్రకటించింది.



