రేవంత్‌ ‘ఖైదీ నెం.150’

– వర్మ ఫేస్‌బుక్‌ ఫోస్టర్‌పై మెగా అభిమానుల ఆగ్రహం
హైదరాబాద్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : రామ్‌ గోపాల్‌ వర్మ అంటేనే ఓ వివాదం.. ఆ వివాదంలోనే సంచలనం ఉంటుంది. ఆయన సినిమాలకు ప్రమోషన్స్‌ అవసరం లేదు .. అతగాడి వివాదాలే ప్రీ ప్రమోషన్స్‌. ఈ వివాదాల వర్మ కాంట్రవర్శీ ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ప్రత్యక్షం అవుతారు. ఎలాంటి విషయాల్లో స్పందిస్తే అది వివాదం అవుతుందో వర్మకు తెలిసినంతగా ఇండస్టీల్రో మరెవ్వరికీ తెలియదు. అందుకే వర్మ తన సినిమాలకు ఈ వివాదాలనే పెట్టుబడిగా ఉపయోగించుకుని ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తాడు. సోషల్‌ విూడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్‌ చేసే రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి సంచలనానికి సోషల్‌ విూడియానే వేదిక చేసుకున్నారు. తాజాగా తెలుగు రాష్టాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన రేవంత్‌ రెడ్డి ఇష్యూపై స్పందిస్తూ రేవంత్‌ను బాహుబలితో పోల్చిన వర్మ తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ చేశాడు. ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌ కండువా కప్పేసిన రేవంత్‌ను ఆకాశానికెత్తేస్తూ.. రెండు పోస్టర్లను ఫేస్‌ బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఇందులో మెగాస్టార్‌ ఖైదీ నెం.150 పోస్టర్లకు రేవంత్‌ రెడ్డి ఫేస్‌ను తగిలించి వీటికి ‘రియల్‌ మెగాస్టార్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌’ అనే టైటిల్‌ పెట్టి.. బాస్‌ ఈజ్‌ హియర్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో ఫేస్‌ బుక్‌లో వదిలాడు. ప్రస్తుతం ఈ ఫోటోలపై కొంత మంది నెటిజన్లు మండి పడుతుండగా మరికొంత మంది వర్మ క్రియేటివిటీకి తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి నిన్న బాహుబలితో నేడు చిరంజీవి ఖైదీ పోస్టర్‌లతో రేవంత్‌కు ఫుల్‌ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్న వర్మ సినీ సర్కిల్‌నేనే కాకుండా పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిగ్‌గా మారారు.