రైతులు, మహిళలు సులభంగా రుణాలు పొందేలా సహాయపడాలి: రాహుల్
అమేధీ: రైతులు, మహిళలు సులభంగా రుణాలు పొందేలా సహాయపడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ బ్యాంకులకు సూచించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి కృషి ఎనలేనిదని ప్రశంసించారు. రాహుల్ గురువారం తన నయోజకవర్గంలో యూకో బ్యాంకు శాఖను ప్రారంభించారు. పేద రైతులు మహిళలు సహా అప్పు అవసరమైన వర్గాలు సులభంగా రుణాలు పొందలేకపోతున్నారని ధనవంతులు మాత్రం సులభంగా పొందుతున్నారని చాలా మంది నాతో అన్నారు. అని చెప్పారు. ఈ పరిస్థితి ఇకపై ఉత్పన్నమవరాదని బ్యాంకు అధికారులకు చెబుతున్నాను. అందర్నీ సమానంగా పరిగణిస్తారని భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.



