రైతు బీమా చెక్కు అందజేసిన తెరస జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్
కుబీర్ ( జనం సాక్షి 26): ఆరు కాలం కష్టపడి పనిచేసే రైతుకు ఏదైనా జరిగితే రైతు భీమా కుటుంబానికి అండగా నిలుస్తుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో రైతు కడేకర్ గంగాధర్ మరణించారు. నామిని బార్య కడెకర్ సునీత కు రూ.5.లక్షల రైతు జీవిత భీమా చెక్కును తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ్ రాజేశ్వర్, ఏఈఓ సాయినాథ్, రైతు అధ్యక్షుడు శేరి సురేష్ లతో కలిసి శుక్రవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పార్డి (బి) లో 22మందికి రైతు భీమా చెక్కులను రూ.1.10కోటి అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ముదోల్ శాసనసభ్యులు గడ్డిగారి విఠల్ రెడ్డి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుకారాం, వార్డ్ సభ్యులు మిలింద్, వడ్ల లక్ష్మణ్, అన్నేవార్ శంకర్, వై. గణేష్, సునుగురు నారాయణ్, కన్నల శేఖర్, ఆఫ్రోజ్, మార్కెట్ డైరెక్టర్ యాకీన్, కో- ఆప్షన్ మెంబర్ కుస్తపుర్ బాబు, గుడాల రాజలింగు, తెరాస నాయకులు బెల్లాల గంగయ్య, తుమ్ సాయిలు, మడి రమేష్, అవుసలి లింబాద్రి, ఇ. నర్సయ్య, ప్రకాష్, పాపిన్వార్ సాయినాథ్, శేర్లపెల్లి గణేష్ , దావుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.