రైస్‌మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

జంగారెడ్డిగూడెం గ్రామీణం : పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం అయ్యపురాజుగూడెం గ్రామంలోని రైస్‌మిల్లులో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మిల్లులోని యంత్రాలు, ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సుమారు రూ. 20 లక్షల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.

తాజావార్తలు