రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
మన్ననూర్: మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన రాములు, నర్సింహులు అనే వ్యక్తులు బుధవారం ఉదయం డోర్నాల వద్ద క్రైస్తవ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో వీరు ద్వీచక్రవాహనంపై హైదరాబాద్‌కు వెళుతుండగా మన్ననూర్‌కు 18 కి.మీ.దూరంలోని ఘాట్‌రోడ్డు మలుపువద్ద గుర్తు తెలియనివాహనం ఢీకొని వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రాములు అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడ్డ నర్సింహను 108 వాహనంలో చికిత్స కోసం అచ్చంపెట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందడు. పోలీసులు సంఘటనాస్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించి కేసునమోదు చేశారు.



