రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
పెద్దపల్లి,ఫిబ్రవరి24(జనంసాక్షి): జిల్లాలోని సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ సవిూపంలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీయడానికి, స్థానికులు, పోలీసులు, 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


