రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలు

కడప, జూలై 31 : కడప జిల్లా రాయచోటి- తంబేపల్లి రహదారిపై ఎర్రగుంట్ల పల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రతిరోజూ లాగానే రాయచోటి పట్టణంలోని విజ్ఞాన్‌ పాఠశాల నుంచి దూర ప్రాంతాలలోని విద్యార్థులను తీసుకువచ్చేందుకు మినీ వ్యాన్‌ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. వాహనం బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయన్న విషయాన్ని గమనించిన డ్రైవర్‌ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. తన వ్యాన్‌ను నెమ్మదిగా తీసుకువెళ్లిఆర్టీసీ బస్సుకు ఢీకొట్టారు. దీంతో ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాయచోటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.