ర్యాగింగ్ కేసులో ప్రొఫెసరు అరెస్టు
వడోదర: ఎంఎస్ యూనివర్శిటీ ఆఫ్ బరోడాకు చెందిన మయూర్ గుప్తా అనే ప్రొఫెసరును ర్యాగింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆర్కిటెక్చర్ విభాగానికి చెందిన ఐదుగురు సీనియర్ విద్యార్థులతో పాటు ఆయన కూడా చేరి జూనియర్ విద్యార్థిని వేధించినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. హర్షవర్థన్ అనే కొత్త విద్యార్థిని వీరు అసభ్య సన్నివేశాలను నటించాల్సిందిగా కోరారని, విద్యార్థిని వారు వేధించిన తీరు, సంభాషణలు సెల్‌ఫోన్‌లో రికార్డయ్యాని వాటి ఆధారంగా తాము కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలియజేశారు.



