లారీ-కారు ఢీ, ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ వద్ద ఈ రోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ-కారు ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహరాష్ట్రకు చెందిన శివరాజు, కీర్తి, అనిల్‌గా పోలీసులు గుర్తించారు. మృతుల బంధువులకు సమాచారం అందించి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

తాజావార్తలు