లారీ ఢీకొన్ని….12 మంది మృతి
రాజంపేట:కడప జిల్లా రాజంపేట మండల రామాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న బొగ్గు లారీ అదుపు తప్పి బొలేరో వాహనాన్ని ఢీకొన్ని ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారి, నలుగురు మహిళలు ఉన్నారు. మృతులంతా నాందేడ్ వాసులు, వీరు నాందేడ్ నుంచి జీపులో తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాజంపేట ఆసుపత్రికి తరలించారు.



