లాల్‌దర్వాజా బోనాలకు భారీగా ఏర్పాట్లు

ఘనంగా నిర్వహిస్తామన్న మంత్రులు

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే లష్కర్‌ బోనాల తరవాత అత్యంత ప్రాముఖ్యం ఉన్న లాల్‌దర్వాజా బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ముగియడంతో ఇక ఈ లాల్‌దర్వాజ బోనాలపై దృష్టి పెట్టారు. ఈమేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికారులనుఆదేశించామని ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం జరిగే బోనాలు, సోమవారం నాటి రంగం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నిశాఖలు సమన్వయంతో బోనాల పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు మంత్రి తలసాని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదేశాలు ఇచ్చారు. దేవాలయాలకు గత సంవత్సరం కంటే ఈసారి అధికంగా నిధులను కేటాయించినట్టు ఆయన తెలిపారు. నిధులను పండుగకంటే ముందే విడుదల చేస్తామన్నారు. జాతరకు తరలి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ 100 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్టు మంత్రి తెలిపారు. శాంతియుతవాతావరణంలో పండగ జరపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేవాలయ కమిటీలు ఘనంగా ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. దేవాలయాల వద్ద సాంస్కృతిక బృందాలతో ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహా దారులు కెవి రమణాచారి చెప్పారు. టూరిజం శాఖ ఎంపిక చేసిన చోట్ల త్రీడీ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. సమాచార శాఖ ¬ర్డింగులను ఏర్పాటు చేస్తుందన్నారు. రోడ్ల మరమ్మతులకు, లైట్ల ఏర్పాట్లకు సరిపడా నిధులు కేటా యించారు. ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచే హైదరాబాద్‌ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ సారథ్యంలోనే నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పండుగకోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాతబస్తీ సింహవాహిని అమ్మవారి బోనాలతో బోనాల జాతర ముగియనుంది. బోనాలతో వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. బోనాలకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశమున్నందున గతేడాది కంటే ఈ సారి అదనంగా వెయ్యి నుంచి 1500 వరకు పోలీసులను పెంచాలని కమిషనర్‌ను కోరినట్టు తెలిపారు.