దోషిగా తేల్చిన ముంబై కోర్టు
ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): గృహ హింస కేసులో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్టేట్ర్ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి భార్య రియా పిళ్లై లియాండర్ పేస్పై గృహ హింస కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్‌ను దోషిగా నిర్దారించిన కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రియా పిల్ళై తన భాగస్వామి అయిన లియాండర్ పేస్ ఇంటిని విడిచి వెళ్లాలి అనుకుంటే. .తనకు నెలకు రూ.లక్ష రూపాయల భరణం చెల్లించాలని, అలాగే అª`దదె కోసం మరో రూ.50వేలు ప్రతినెలా అందించాలని పేస్‌ను కోర్టు ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్టేట్ర్ కోమల్‌సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిదేళ్లుగా తాము ఇద్దరం లివ్ఇన్ రిలేషన్లో ఉన్నామని.. పలు సార్లు పేస్
గృహ హింసకు పాల్పడ్డాడని రియా పిª`లళై ఆరోపించింది. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని కోరుతూ రియా పిల్ళై 2014లో కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై తీర్పును కోర్టు వెల్లడిరచింది.
లియాండర్ పేస్పై గృహహింస కేసు
Other News
- టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
- కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
- కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
- వానాకాలం పంటల సాగుకు యాక్షన్‌ప్లాన్
- అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
- కోనసీమలో నిఘా వైఫల్యం
- కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
- *బీసీ యువతకు నైపుణ్యాభివ్రుద్ది కార్యక్రమాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ*
- *సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
- *రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*