లోయలో పడిన మిని బస్సు : 8 మంది దుర్మరణం
తమిళనాడు: అదుపు తప్పి ఓ మిని బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన నీలగిరి జిల్లా కొత్తగిరిలో చోటు చేసుకుంది. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.



