వచ్చే నెల 15న పీఎఫ్‌ వడ్డీ రేటుపై నిర్ణయం!

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ డిపాజిట్లపై ఎంత మొత్తంలో వడ్డీరేటు చెల్లించాలనే విషయాన్ని వచ్చే నెల 15న జరగబోయే ట్రస్టీల సెంట్రల్‌ బోర్డు సమావేశంలో తేల్చే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని ఏకాభిప్రాయం కోసం కేంద్ర ఆర్థిక శాఖకు పంపించడం జరుగుతుంది. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌వో) ప్రాథమిక అంచనా ప్రకారం 2012-13లో ఖాతాదారులకు 8.6 శాతం చొప్పున వడ్డీ చెల్లించని పక్షంలో సంప్థ ఆదాయంలో నిధులు మిగలడం కానీ, లోటు భారం గాని ఉండబోదని తెలుస్తున్నది. కానీ యూనియన్లు మాత్రం 8.8 శాతం వడ్డీ చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈపీఎఫ్‌వోకు దేశవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది ఖాతాదారులున్నారు.