వచ్చే సమావేశంలో స్పీకర్‌ నివేదిస్తాం: సత్యానందరావు

హైదరాబాద్‌: ఎంఐఎం శాసనసభ్యుడు ఆగ్బరుద్దీన్‌ వివాదాస్పద ప్రసంగాన్ని వచ్చే సమావేశంలో పరిశీలించి తగిన సిఫార్సులు చేయాలని శాసనసభ నైతిక విలువల సంఘం నిర్ణియించింది. సోమవారం శాసనసభ నైతిక విలువ సంఘం నిర్ణియించింది. సోమవారం శాసనసభ కమిటీ హాలులో ఈ సంఘం సమావేశమైంది. చట్టసభ సభ్యుడిగా ఉంటూ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీస్‌ పై చర్యలు తీసుకోవాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దుచేయాలని సీసీఐ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివారవు సమావేశంలో అబిప్రాపడ్డాడు. మిగిలిన సభ్యులుకూడా ఆయన వాదనతో ఏకీభవించారు. దీంతో సభ్యుల అబిప్రాయాలను స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్థానని నైతిక విలువల సంఘం అధ్యక్షుడు సత్యానందరావు తెలిపారు. సమావేవం అనంతరం సభ్యల అభిప్రాయాలను సభావతి దృష్టికి తీసుకెళ్లారు. అక్భరుద్దీన్‌ పై తనకు వచ్చిన ఫిర్యదులను కూడా స్పీకర్‌ ఈ సంఘానికి సిఫార్సు చేశారని సత్యానందరావు చెప్పారు. వచ్చే సమావేశంలో అక్బరుద్దీన్‌ ప్రసంగాలు విని తీసుకోవాల్సిన చర్యల్ని సభావతికి నివేదిస్తామని తెలిపారు. వ్యాఖ్యల తీవ్రతను బట్టి శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేయాలని సిఫార్సు చేసే అవఖాశం ఉందన్నారు.