వట్టి గెడ జలాశయానికి భారీగా వరద నీరు
విజయనగరం ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వట్టిగెడ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నీటిమట్టం 399 అడుగుల గరిష్ట స్థాయికి చేరడంతో దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.



