వరంగల్‌లో చంద్రబాబుకు తెలంగాణ సెగ

వరంగల్‌ : జిల్లాలో ‘ వస్తున్నా మీకోసం ‘ పేరుతో పాదయాత్ర చేస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం పెదకోడేపాకలో పాదయాత్రలో అయనకు చేదు అనుభవం ఎదురైంది. స్కూల్‌ విద్యార్థులు అయనకు ‘ జై తెలంగాణ ‘ నినాదాలతో నిరసనలు తెలియజేశారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని తెలపాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో బాబు కంగుతిన్నారు.