వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి

వరంగల్‌: పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం ముట్టడికని వచ్చిన దుండుగులు కార్యాలయాన్ని ధ్వసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఆఫీసును ముట్టడించారు. అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ దుండుగులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఇరువర్గాల మథ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఆలస్యంగా రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు దాడిలో కూడా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ఎక్కువ మంది గాయపడ్డారు.