వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి నేటితో 11 ఏళ్లు
వాషింగ్టస్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి నేటికి 11 ఏళ్లు పూర్తియ్యాయి.ఈ సందర్భంగా గ్రౌండ్ జీరో వద్ద మృతులకు అమెరికా అధ్వక్షుడు ఒబామా ఘన నివాళి అర్పించారు. అమెరికా పౌరుల రక్షణ కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఒబామా తన శాంతి సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు 9/11 హెల్త్ ట్రీట్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా 50 రకాల క్యాన్సర్ వ్యాధులను నయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా అమెరికాలోని సుమారు 70 వేల మంది ప్రయోజనం పొందనున్నారు. గ్రౌండ్ జీరో నుంచి వెలువడిన విషపూరిత దూళి కారణంగా వేల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.



