వరిపై రెండోరోజూ చర్చలు

హైదరాబాద్‌: హైబ్రీడ్‌ వరిపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో రెండోరోజైన మంగళవారం 32 దేశాల నుంచి వచ్చిన 400 మంది పరిశోధకలు చర్చల్లో పాల్గొన్నారు. మరింత దిగుబడి సాధించడానికి తీసుకోవలసిన చ్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. మధ్యాహ్నం వరకూ చర్చల అనంతరం రాజేంద్రనగర్‌లోని జాతీయ వరి పరిశోధనా స్థానం (డీఆర్‌ఆర్‌) లో క్షేత్ర పరిశీలనకు డీఆర్‌ఆర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వర్తమఠ్‌ ఆధ్వర్యంలో రెండోరోజు చర్చలు సాగాయి.