వల్లివీడులో 8 మందికి డెంగీ లక్షణాలు
నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరి మండలం వల్లివీడులో జ్వరంతో 52 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎనిమిది మందికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆదివారం వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి. నెల్లూరు, చెన్నై ఆసుపత్రులకు తరలించారు. వల్లివీడులో వైద్య శిబిరం ఏర్పాటుచేసి తక్షణ వైద్య సేవలను అందిస్తున్నారు. దోమల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలియజేశారు.



