వస్త్రవ్యాపారుల నిరాహర దీక్ష

జహీరాబాద్‌:ప్రభుత్వం వస్రాలప్తె విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జహీరాబాద్‌లో వస్త్రవ్యాపారులు సోమవారం నిరహర దీక్షలో కూర్చున్నారు.వారం రోజులుగా దుకాణాలు మూసి వేసి నిరసన తెలుపుతున్నా,ప్రభుత్వం
స్పందించకపోవటంతో ఆదివారం గుంటూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి నిరహర దీక్ష ప్రారంబించినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి వీరేశం పేర్కొన్నారు గుంటూరు వళ్లిన ఆయన సోమవారం ఉదయం జహీరాబాద్‌ చేరుకొని దీక్షను ప్రారంభించారు.దీక్షకు మద్దతుగా వ్యాపారులు నల్ల జెండాలు పట్టుకుని పట్టణంలో ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అశోక్‌ చెంద్రే,ముజాహిద్‌,సత్యనారాయణ,రాచణ్ణ తదితరులు పాల్గోన్నారు.